ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో  హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో  యూత్  నాయకుల సంబరాలు

విశ్వంభర, హుస్నాబాద్ :  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో, ఎన్ ఎస్ యు ఐ  హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి ఆధ్వర్యంలో హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నీట్  పేపర్ లీక్ కావడం వల్ల మనస్తపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన అలాగే విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలు, విద్యార్థుల హక్కుల కోసం జరిగిన పోరాటాలు ఫలితాన్నిచ్చాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సనత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం పోరాడిన ప్రతి విద్యార్థికి, యువజనానికి, ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థుల హక్కుల కోసం యూత్ కాంగ్రెస్ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ,హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి వి రమణ,హుస్నాబాద్ ఎన్ ఎస్ యు ఐ  పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ ,ఎన్ ఎస్ యు ఐ  పట్టణ ఉపాధ్యక్షుడు రాకేష్, మున్సిపల్ కౌన్సిలర్ లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/with-the-resignation-of-dharmendra-pradhan-youth-leaders-celebrated-at/article-19850

Tags: