బుల్లెట్ ట్రైన్ కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం: డా. వుర రామ్మూర్తి యాదవ్
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేటను బుల్లెట్ ట్రైన్ మార్గంలో చేర్చాలని కోరుతూ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని ప్రముఖ వైద్యులు డా. వుర రామ్మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు కట్ట (మినీ ట్యాంక్‌బండ్) వద్ద వాకర్స్‌తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూర్యాపేట వంటి ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రాన్ని ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ నుంచి తప్పించడం అన్యాయమన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించేలా కృషి చేయాలని కోరారు. అవసరమైతే దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఈ నెల 27న అంజనపురి కాలనీ వద్ద నిర్వహించే రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, సీపీఎం నాయకులు మట్టిపల్లి సైదులు, డాక్టర్ రమేష్ చంద్ర, భయ్యా మల్లికార్జున్ యాదవ్, వాకర్స్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.