ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి.
నివాళులు అర్పించిన డా . కాచం సత్యనారాయణ
విశ్వంభర, హైదరాబాద్ :- స్వాతంత్య్ర సమరయోధులు , ఆజాద్ హిందు ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక చైర్మన్ డా . కాచం సత్యనారాయణ గుప్త ఎల్బీనగర్ లోని నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయుడు ,మరణమే లేని వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వారి జ్ఞాపకాలను గుర్తు చేసారు. భారత దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు పోరాటం చేసిన గొప్ప యుద్ధవీరుడు ఈ దేశ ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలను అందించి, నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే నేతాజీ చేసిన పోరాటమే డా. కాచం కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆడాల రమేష్, ఏలే పురేందర్ ,కొత్త రవి, ఇరుగు శ్రీధర్ , దుమ్మాజి నవీన్ , రాజు గుప్త, గజవెళ్లి గురుమూర్తి, , కార్తిక్ , కాచం చంద్ర శేఖర్ , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



