ఐకేపీ కేంద్రాల్లో ఢాన్యం కొనుగోళ్ళు మొదలుపెట్టాలి   

ఐకేపీ కేంద్రాల్లో ఢాన్యం కొనుగోళ్ళు మొదలుపెట్టాలి   

 విశ్వంభర, రామన్నపేట: ఐకేపీ తదితర ఆధ్వర్యంలో నడిచే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ళను మొదలు పెట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, తుమ్మలగూడెం గ్రామంలోని ఐకేపీ ఆద్వర్యంలో నడిచే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కాంటాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని, వెంటనే రైస్ మిల్లు అలాట్మెంట్ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జల్లెల పెంటయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలోని స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు పోసిన 74 ధాన్యం కుప్పలను పరిశీలన చేసి అనంతరం మాట్లాడుతూ, గ్రామంలో రైతులు పోసిన ధాన్యం రాశులకు కాంటాలు పెట్టక పోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. గత సీజన్లో కూడా ఇక్కడే పోయడం జరిగిందని మార్కెట్ ప్రారంభించి 15 రోజులు దాటుతుందని, ఇప్పటి వరకు నిర్వాహకులను కేటాయించలేదని అన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలును ప్రారంభించాలని, లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చెప్పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, మండల కమిటి సభ్యులు మీర్ ఖాజా అలీ, శాఖ కార్యదర్శి గన్నేబోయిన శ్రీనివాస్, నాయకులు రాదారపు మల్లేష్, బోనగిరి శ్రీనివాస్, అశోక్, సుర సత్తయ్య గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags: