బొల్లారంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
విశ్వంభర, బొల్లారం: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బొల్లారం 272 డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొలన్ బాల్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో అవమానాలు భరించి, కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి స్వరాష్ట్రాన్ని సాధించినది ఈ గులాబీ జెండానేనని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మాజీ కౌన్సిలర్లు వి. హనుమంత్ రెడ్డి, వి. వేణుపాల్ రెడ్డి, బి. జైపాల్ రెడ్డి, మన్నే సతీష్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ అరూర్ రత్నం, పుండరికం, బొల్లారం బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ ప్రెసిడెంట్ ఖాసీం, బీసీ ప్రెసిడెంట్లు శ్రీశైలం, మైలారం శ్రీను, మైలారం యాదగిరి, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మొహమ్మద్ రఫీ, జనార్దన్, ఆది, సురేష్ తదితరులు మరియు యువకులు పాల్గొన్నారు



