మీన్‌పూర్ డివిజన్‌లో  బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంఅ

మీన్‌పూర్ డివిజన్‌లో  బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంఅ

విశ్వంభర, సంగారెడ్డి: తెలంగాణ అస్తిత్వం కోసం, స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఘనత గులాబీ జెండాకే దక్కుతుందని అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ ఆలయం ఎదురుగా ఉన్న చెరువు కట్ట వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాండురంగా రెడ్డి  పార్టీ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో అవమానాలను భరించి, కుట్రలను ఛేదించి, తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి స్వరాష్ట్ర కలని నిజం చేసిన జెండా మన గులాబీ జెండా అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags: