గోవును జాతీయ గోమాతగా తి ప్రకటించాలని విన

గోవును జాతీయ గోమాతగా తి ప్రకటించాలని విన

 విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని జగద్గురు శ్రీఆది శంకర గోశాల ఆధ్వర్యంలో గోవును జాతీయ గోమాతగా ప్రకటించాలని, ఇంద్రపాలనగరం గ్రామం, మండల కేంద్రంలో భారీ బైకులతో  ర్యాలీ నిర్వహించి, మండల తహసిల్దార్ లాల్ బహదూర్ కు, మండల పోలీసులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం గోశాల నిర్వాహకులు మండల నరసింహ మాట్లాడుతూ, తమ గోశాల తరఫున గోరక్షణ చర్యలు చేపడుతున్నామని, గోరక్షణే తమ ఊపిరని, అక్రమ కబేలాలను మూసివేయాలని, గోమాతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చి, మన జాతీయ గోమాతగా ఆమోదించేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని, గోహత్యను ఆపడానికి అందరం పాత్రదారులం అవుదామని, గోశాలకు సరైన హక్కులను ప్రభుత్వం కల్పించాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి మొగులయ్య, మండల నరసింహ, కె.వెంకటేష్, రాహుల్, మండల కృష్ణ, పూస నవీన్, కాలేరు నాగరాజు, కైరంకొండ సంతోష్ కుమార్, కైరంకొండ రాజేష్ కుమార్, బోయిని శివకుమార్, గుర్రం లక్ష్మణ్ బాబు, నాగరాజు, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: