బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం రోజు మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం జెండా ఆవిష్కరణ చేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ 14 సంవత్సరాల పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని  సాధించిన రాష్ట్రంలో సకల జనులు సంతోషంగా ఉండాలని, ఆకాంక్షతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, పేద కుటుంబాలలో వెలుగును నింపిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేఖ యాదయ్య, జిల్లా నాయకులు ఎస్కే చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, ఉప-సర్పంచ్ చొప్పరి నరసింహ, నాయకులు నోముల యాదగిరి, దుండగుల సమ్మయ్య, నక్క నరేందర్, జాల అమరేందర్ రెడ్డి, జెట్టి శివప్రసాద్, నల్ల సైదులు, ఆవుల శ్రీధర్, చిప్పలపల్లి రవి, గాదె శంకర్, వర్కల రమేష్, ఎండి హరీప్, బైరు హరికృష్ణ, వర్కల మల్లేష్, ఎర్రబోయిన సత్తయ్య, గట్టు ముత్తయ్య, పోషబోయిన నాగరాజు, ఏసబోయిన మల్లేశం తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: