భవిష్యత్ లో బీఆర్ఎస్ దే అధికారం
విశ్వంభర, సిద్దిపేట: విశ్వంభర, సిద్దిపేట: భవిష్యత్ లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ సర్పంచ్ గోపులపురం భానుచందర్ అన్నారు. కేసీఆర్ సీఎం కావడం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ వేడుకలను గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భానుచందర్, ప్రేమ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు కొట్లాడితే గాని కాంగ్రెస్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదన్నారు. పొద్దుతిరుగుడు పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం హరీశ్ రావు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. వేడుకలో ఉప సర్పంచ్ కోడి రాజం, తీగల నరేశ్ గౌడ్, కొంపల్లి పద్మ, సురేశ్ గౌడ్, మహేశ్ వేణు తదితరులు పాల్గొన్నారు.



