కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి
విశ్వంభర, ఇనుగుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య రైతులకు సూచించారు. ఐకెపి(సెర్ఫ్)నెల్లికుదురు ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండలం చిన్ననాగారానికి చెందిన రాజమాత గ్రామైక్య సంఘం కొనుగోలు కేంద్రం మీట్య తండ పరిధి లైన్ తండా వద్ద సర్పంచి సుజాత యాకయ్య సోమవారం ఏపీఎం నరేంద్ర కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ..రైతులను దళారీల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. మాయిశ్చర్ వచ్చేంతవరకు వడ్లను ఆరబోసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ , పంటలకు మద్దతు ధర, బోనస్ లు అందజేస్తూ అండగా ఉంటున్నదన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్ చారి, పంచాయతీ కార్యదర్శి శేఖర్, మాజీ ఉపసర్పంచిలు నాయిని కొమురయ్య యాదవ్, భూక్యరాములు,నాయకులు రవి నాయక్, యాకుబ్ రెడ్డి,సీసీలు పద్మ,సోమయ్య, పుల్లయ్య,గాయపు విజయలక్ష్మి, వివో అధ్యక్షురాలు గుడాల కవిత, కార్యదర్శిలు శీలం పద్మ,గుండాల యమున, సెంటర్ ఇన్చార్జిలు నాయిని కోమలత,బైరు శ్రీమతి కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ రైతులు పాల్గొన్నారు.
.



