సెయింట్ మేరీ హై స్కూల్ స్వర్ణోత్సవ వేడు కలు
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: నల్లకుంటలోని సెయింట్ మేరీ హై స్కూల్ 50 సంవత్సరాల పూర్తి సందర్భంగా స్వర్ణోత్సవ వార్షికోత్సవం హైదరాబాదు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ అమృత హాజరై ప్రసంగించారు. “పిల్లల చదువులను మధ్యలో ఆపకుండా కొనసాగించాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ చదువుపై ఆసక్తి పెంపొందించాలి. పిల్లలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. చదువులతోపాటు ఇతర రంగాల్లో కూడా రాణించేలా ప్రోత్సహించాలి. పిల్లల్లో సంస్కారం, ధన్యవాద భావన వంటి మంచి అలవాట్లు పెంపొందించాలి” అని పేర్కొన్నారు. సంప్రదాయ దీపప్రజ్వలనతో ప్రారంభమైన వేడుకలో విద్యార్థిని, విద్యార్థులు నృత్యాలు, నాటికలు, పాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. గత సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమని తెలిపారు. పిల్లలపై ఒత్తిడి కాకుండా ప్రోత్సాహం, మార్గదర్శనం ఇవ్వాలని సూచించారు. పిల్లల ప్రతిభను గుర్తించి, చదువులతోపాటు ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి చెందేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. స్కూల్ కరస్పాండెంట్ అతిథులను ఆత్మీయంగా సత్కరించారు. పూర్వ విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఐపీఎస్ గా ప్రజలకు సేవలు అందిస్తున్న సందీప్ మాట్లాడుతూ పాఠశాల తన జీవితానికి బలమైన పునాది వేసిందని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, మేఘ, అధ్యాపక బృందం, స్వరూప, వాసవి తదితరులు పాల్గొన్నారు.



