ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిఆర్ఎస్ సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ఉప-సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకులు, రైతు సంఘం నేతలు, బిఆర్ఎస్ గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.



