సూర్యాపేటలో ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 

సూర్యాపేటలో ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ 23వార్డులో గణంగా బి.ఆర్.ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన 23వ వార్డ్ ఇంచార్జి వల్దాస్ స్పందన కిరణ్ , వార్డ్ అధ్యక్షులు ఏర్పుల కిరీటి, మాజీ కౌన్సిలర్  కళ్లేపెళ్లి మహేశ్వరి దశరథ.  ఈ సందర్భంగా వల్ధాస్ స్పందన కిరణ్ మాట్లాడుతూ ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రజల గోసను చూసి జగదీష్ రెడ్డి  లాంటి కొద్ది మంది నాయకులతో ఉద్యమాన్ని ఆరంభించిన కేసిఆర్  అతి కొద్ది కాలంలోనే సబ్బండ వర్గాలను, తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ  ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఎన్ని అవమానాలు,అవహేలనలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. సాధించుకున్న తెలంగాణాను ప్రజల ఆకాంక్షల మేరకు భారత దేశంలోనే అగ్రభాగాన నిలిపారని అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రజల ఎదురుకోన్న త్రాగునీటి సమస్యను మిషన్ భగిరథ ద్వారా తీర్చారని అన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించి రైతులు భాదను తీర్చారని అన్నారు. మ్యానిఫెస్టోలో లేని రైతు బంధు, రైతు భీమా, కళ్యాణాలక్ష్మి,షాదిముబారక్ లాంటీ  అందించిన గణత  కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు  అని పేరుకొన్నారు, రాజ్యాంగం అనగానే డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ , సేవా అనగానే మధర్ థెరిసా, తెలంగాణ అనగానే  పేర్లు చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లోకించివున్నవి అని తెలియజేశారు.రానున్న రోజుల్లో మళ్ళి బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని,కేసిఆర్  ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టి ముఖ్య నాయకులు వల్ధాస్ ఉపేందర్,బచలకురి సుధాకర్ ,వీర్జల వేణు బలరాం ,మాజీ కౌన్సిలర్ లు  కస్తాల పద్మ ,గండమళ్ళ యాదగిరి ,వీర్జల శివ , చితమల్ల జ్యోతి , బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు పిడమర్తి మధు,కొప్పుల భరత్ ,బచ్చలకూరి విష్ణు, జానపాటి రాజీవ్,వార్డు ప్రజలు, అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

Tags: