వైకుంఠ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలునాయక్
విశ్వంభర, చింతపల్లి : చింతపల్లి మండల కేంద్రంలో కీర్తిశేషులు దాచేపల్లి పద్మ జ్ఞాపకార్థం, దాచేపల్లి యాదయ్య కుటుంబ సభ్యుల సహకారంతో కొనుగోలు చేసిన గ్రామ పంచాయతీ దహన సంస్కారాల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చింతపల్లి గ్రామంలో దహన సంస్కారాల కోసం వైకుంఠ రథాన్ని దేచేపల్లి యాదయ్య, దేచేపల్లి మధు ప్రత్యేకంగా తయారుచేయించి ప్రజలకు అందించడం వారి సహకారాన్ని వెలకట్టలేమన్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారిని వైకుంఠ రథం ద్వారా ఉచితంగా స్మశాన వాటికక తీసుకపోవడానికి అందుకుగాను ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని, పూర్తిగా గ్రామ పంచాయతీ ఖర్చులు భరిస్తుందని ఆయన తెలిపారు. ఈ వైకుంఠ రథాన్ని ప్రతి ఒక్కరూ పేద, ధనిక తేడా లేకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచ్చర్ల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, స్థానిక సర్పంచ్ కాసారపు శ్వేతా శ్రీనివాస్, ఉప సర్పంచ్ రెహనా బేగం సిద్ధిక్ బాబా, దాచేపల్లి యాదయ్య, దాచేపల్లి మధు, చెట్లపల్లి హరిప్రసాద్, వందనపు ఆంజనేయులు, మార్కెట్ డైరెక్టర్ ముషావర్, గోవిందు రవికుమార్, ఎలిమినేటి నరసింహ, గుణమోని కొండల్, ఎండి జాఫర్, గురుకుల నరేష్, కొప్పుల శ్రీను, కుంచకూరి రాము, తేరేపల్లి కిషోర్, నీల వెంకన్న, గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



