ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పోస్టర్ ఆవిష్కరణ
విశ్వంభర, మహబూబాబాద్: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ,ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం’ ప్రచార పోస్టర్‌ను నేడు అధికారికంగా ఆవిష్కరించారు. భారతదేశంలోని టాప్-500 అగ్రశ్రేణి కంపెనీలలో ఇంటర్న్‌షిప్ పొందేందుకు ఈ పథకం ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 9,000 ఆర్థిక సహాయం (స్టైఫండ్) అందించబడుతుంది. దేశంలోని ప్రముఖ కంపెనీలలో ప్రత్యక్షంగా పనిచేస్తూ వాస్తవ పరిశ్రమ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి ఉద్యోగంలో లేని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వివిధ రంగాల్లో ఈ ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరడమైనది. pminternship.mca.gov.in, టోల్ ఫ్రీ నంబర్: 1800 116 090 వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు . యువత తమ కెరీర్‌ను ఉన్నతంగా నిర్మించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చింది. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాసరావు, దేశీ రామ్ నాయక్, ఉపాధి కల్పన అధికారి రజిత, క్రీడల అధికారి జ్యోతి లతో కలెక్టర్ పోస్టర్ ఆవిష్కరించారు.



