ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలి

ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం కల్పించాలి

విశ్వంభర, బాగ్ లింగంపల్లి :  ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల నిర్లక్ష్యంతో 300 మందికి పైగా ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి  అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు.  ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నా.. పలువురికి ఇంకా హాల్ టికెట్లు జారీ కాలేదన్నారు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను కాలేజీలు సకాలంలో పూర్తి చేయకపోవడమే దీనికి కారణమని పేర్కొన్నారు. యాజమాన్యాల తప్పులకు విద్యార్థులను బలి చేయడం సరికాదని, హాల్ టికెట్లు రాని విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags: