లయన్స్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ కాచం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
On
ప్రజా విశ్వంభర, హైద్రాబాద్ : 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలును పురస్కరించుకొని లయన్ క్లబ్ ఆఫ్ హైద్రాబాద్ కాచం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లయన్ డా. కాచం సత్యనారాయణ సమక్షంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమారయోధుల త్యాగాలను గుర్తు చేసుకొని వారి చేసిన కృషిని గుర్తు చేసారు. వారి పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కాసం సాయి, లయన్ ఇరుగు శ్రీధర్, లయన్ మేడికొండ పరమేష్, లయన్ బి.ఆర్. అరుణ్ అంబెడ్కర్ మాదిగ, లయన్ అన్వర్, లయన్ కార్తిక్ , లయన్ బోయపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



