కోమటిపల్లి లో చలివేంద్రం ప్రారంభం
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని కోమటిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆ గ్రామ సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చలివేంద్రంలో కొత్త మట్టి కుండలలో మినరల్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థులతో పాటు బాటసారు లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అరైవ్ అలైవ్ గ్రామ సభలో సర్పంచ్ బిక్షపతి గౌడ్ గ్రామస్తులకు సూచించారు. బైకు నడిపేవారు హెల్మెట్స్ ధరించాలన్నారు. లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లు నడపవద్దని పేర్కొన్నారు. కార్లలో వెళ్లే వారు బెల్టులు పెట్టుకోవాలని చెప్పారు. అనంతరం ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇస్లావత్ బాబు, వార్డు సభ్యులు ఇస్లావత్ బాలు,నీలం వెంకన్న, మాజీ సర్పంచ్ నీలం యాకయ్య,యాకమూర్తి, అంగన్వాడీలు ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.



