చిల్లర చేతలు చేస్తే తాట తీస్తాం..! - షాబాద్ సీఐ కాంతారెడ్డి
ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి
విశ్వంభర, షాబాద్ ;- నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడంలో యువత బరితెగింపు చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, చిల్లర చేతులు చేస్తే తాట తీస్తామని షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల కోసం రోడ్లపై డ్యాన్సులు చేయడం, మద్యం సేవించి న్యూసెన్స్ చేయడం వంటి చిల్లర వ్యవహారాలు చేయడం తగదన్నారు. డిసెంబర్ 31న రాత్రి కీలకమైన చోట్ల పికెట్లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిఘా పెడతామని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీధుల్లో కేకులు కట్ చేయడం, డీజేలు పెట్టి హంగామా చేయరాదన్నారు. సైలెన్సర్ తీసి డ్రైవింగ్ చేసిన.. రాష్ డ్రైవింగ్ చేసిన ఆ బైక్లను సీజ్ చేస్తామన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత రోడ్లపై తిరగకూడదని, ఎవరైనా పోలీస్ ఆంక్షలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సౌండ్ పొల్యూషన్ ఏ విధంగా ఉన్న చర్యలు చేపడతామని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.....



