అదే జరిగితే అతడిని సన్మానిస్తాం.. కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ప్రశంసల జల్లు

అదే జరిగితే అతడిని సన్మానిస్తాం.. కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ప్రశంసల జల్లు

అదే జరిగితే అతడిని సన్మానిస్తాం.. కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ప్రశంసల జల్లు

బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పినందుకు కిషన్ రెడ్డి మాటలు స్వాగతిస్తున్నామని.. అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారు. ఐదేళ్లు సీఎం రేవంత్.. కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్. ప్రభుత్వాలను పడగొట్టే దాంట్లో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు. తెలంగాణ లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా పడగొట్టే అవకాశం లేదు. బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదని తేలిపోయింది. అందుకే రోజుకో భాషా.. రోజుకో వేషం మారుస్తున్నారు. కిషన్ రెడ్డి చాలా గొప్పవారు. అటల్ బీహార్ వాజ్ పాయ్ దారిలో నడుస్తున్నట్టు కనిపించింది. మంచి పని చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రశంసించే గుణం వాజ్ పాయ్ ది. నిండు పార్లమెంట్ లో ఇందిరాగాంధీని దుర్గ మాతతో పోల్చారు. 25 మంది brs mla లు కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటే.. ఐదు నెలల కాంగ్రెస్ పాలన బాగుందని అర్థం. కాంగ్రెస్.. రాష్ట్రంలో మంచి పాలన ఉందని ప్రశంస మాకు మంచిదే.” అని ఆయన పేర్కొన్నారు.

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బీజేపీ, బీఆర్ఎస్ శత్రువులే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ఏనాడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. తెలంగాణలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు జరగలేదన్నారు.

Read More ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా