మీడియేషన్ న్యాయవాది మల్లారెడ్డి కి గుర్తింపు ధ్రువపత్రం 

విశ్వంభర, మహబూబాబాద్: మధ్య వర్తిత్వం ద్వారా 10 కేసులను పరిష్కరించిన నేపథ్యంలో మహబూబాబాద్ మీడియేషన్ న్యాయవాది వై. చెన్న మల్లారెడ్డి కి సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ గుర్తింపు ధ్రువపత్రం జారీ చేసింది. 10 కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించిన తరువాతే మధ్యవర్తిత్వ న్యాయవాదికి ఈ పత్రాన్ని జారీ చేస్తారు. ఈ ఘనత సాధించిన మల్లారెడ్డి కి సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ ధ్రువీకరణ పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వము లేదా లోక్ అదాలత్ ద్వారా కేసులు రాజీమార్గంలో పరిష్కరించబడినట్లయితే ఇరుపక్షాలు కేసు గెలిచినట్లేనని ఈ విధంగా రాజీ దిశగా ఇరుపక్షాలని ప్రోత్సహించటంలో శిక్షణ పొందిన మధ్యవర్తు లు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మధ్యవర్తిత్వ న్యాయవాదులు మల్లారెడ్డి, బి కృష్ణ, బి. శ్రీనివాస్,  టి. సైదులు తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/identity-certificate-for-mediation-advocate-mallareddy/article-15859

Tags: