నేను ఎలాంటి ఫేక్ డాక్యుమెంటు సృష్టించ లేదు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన : రైతు ఎం ఏ. సుకుర్

నా దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి

నేను ఎలాంటి ఫేక్ డాక్యుమెంటు సృష్టించ లేదు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన :  రైతు ఎం ఏ. సుకుర్

విశ్వంభర, మహేశ్వరం :  నేను ఎలాంటి ఫేక్ డాక్యుమెంటు సృష్టించ లేదని నా దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని మహేశ్వరం గ్రామానికి చెందిన  రైతు ఏంఏ సూకుర్ అన్నారు.  ఈ సందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూకూర్ మాట్లాడుతూ నేను 2006 సంవత్సరం సెప్టెంబర్ నెల లో మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం సర్వేనెంబర్ 378 లో 3 ఎకరాల 29 గుంటల భూమి కొనుగోలు చేశాను నా దగ్గర అన్ని లింకు డాక్యుమెంట్లతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని ఏలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ కు నేను పాలు పడలేదని అన్నారు. కొంత మంది కావాలని నా భూమి పై కన్నేసి నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఆర్థిక బలం అంగ బలం ఉందని  నన్ను బెదిరించి భూమిని స్వాధీనం చేసుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేసుకుంటూ ఇదే భూమిని నమ్ముకొని రైతుగా బ్రతుకుతున్నానని ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు నా భూమి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. నేను భూమి కొనేముందు  న్యూస్ పేపర్ లో పబ్లిక్  నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని నోటీసు ఇచ్చిన నెలరోజుల తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.  నా భూమి అంటూ ఇప్పుడు వచ్చినవారు నేను నోటీసు ఇచ్చినప్పుడు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.  సంవత్సరంగా నా భూములను వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారని ఇప్పుడు కొందరు కావాలని కుట్ర చేస్తూ నా భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

Tags: