బాధిత కుటుంబాలకు మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ అండ
- రూ.10,032 ఆర్థిక సాయం అందజేత
విశ్వంభర, గుండాల: "మానవసేవే మాధవసేవ" అనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకుంది. గుండాల మండలంలోని నూనెగూడెం, తుర్కల షాపురం గ్రామాల్లో ఇటీవల కుటుంబ పెద్దలను కోల్పోయిన రెండు బాధిత కుటుంబాలను ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ.5,016 చొప్పున మొత్తం రూ.10,032 ఆర్థిక సాయం అందజేశారు. నూనెగూడెం గ్రామానికి చెందిన అండెం స్వరూప అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మబ్బు మహేష్, ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అదేవిధంగా తుర్కల షాపురం గ్రామానికి చెందిన పాలోజు సత్యనారాయణ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో, వారి కుటుంబాన్ని పరామర్శించి ఫౌండేషన్ తరఫున రూ.5,016 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మబ్బు మహేష్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు తోడుగా నిలవడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి తమ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ మండల ఇన్‌చార్జులు మల్లెపాక పరశురాములు, గొల్లపల్లి సురేష్, సభ్యులు అల్వాల రాజు, పాలడుగు భరత్, అల్వాల పరశురాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.