రాష్ట్రస్థాయి పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు

 విశ్వంభర,ఇనుగుర్తి: రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలకు ఇనుగుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ 8వ,తరగతి విద్యార్థులు బొల్లు సహస్ర,మందుల నిఖిల్ ఎంపికయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రం మహబూబాబాద్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ లో వీరు అసాధారణ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ జంగా రూపా రాణి సహస్ర,నిఖిల్ తో పాటు వీరికి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన పి.డి తాళ్ల ప్రణయ్ ను అభినందించారు.క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇన్చార్జి హెచ్ఎం అమ్మ అక్కయ్య మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. ఉపాధ్యాయ బృందం అభినందించింది. కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ కిషన్ పాల్గొన్నారు.

Tags: