ఘనంగా మహిళా దినోత్సవం
On
విశ్వంభర, నెల్లికుదురు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.నెల్లికుదురు గ్రామపంచాయతీలో సర్పంచి పులి వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్ పాల్గొన్నారు.మహిళల హక్కులు,చట్టాలపై అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. బ్రాహ్మణ కొత్తపల్లి లో జరిగిన కార్యక్రమానికి ఎంపీడీవో హాజరై తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా ఉంచడం పై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళా సాధికారత,హక్కులు,చట్టాలపై వివరించారు. అన్ని గ్రామాలలో సంబంధిత కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో సర్పంచులు, ఉప సర్పంచులు,వార్డు సభ్యులు పంచాయితీ కార్యదర్శులు,మహిళలు పాల్గొన్నారు.



