ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలు
On
విశ్వంభర, ఇనుగుర్తి: ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి కాగానే ఫాల్గుణ మాసం మంచి రోజులు రావడంతో గృహప్రవేశాలు ఊపందుకుంటున్నాయి. నూతన ఇళ్లకు రంగులు వేసి తోరణాలు కట్టి,బాజాభజంత్రీల తో కూరాళ్లు పట్టి, గోమాతను ఆహ్వానించి,బ్రాహ్మణో త్తముల వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజలు,వ్రతాలు నోమి గృహప్రవేశాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు చుంచు భద్రయ్య నర్సమ్మ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ జీవితకాలంలో ఇల్లు కడతామో లేదో అనుకున్నాము, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.



