మత సామరస్యానికి ప్రతీక హజరత్ అబ్బాస్ దర్గా

మత సామరస్యానికి ప్రతీక హజరత్ అబ్బాస్ దర్గా

  • ఉత్సవాలకు ముస్తాబవుతున్న దర్గా
  • ఈ నెల 21నుండి 23వరకు 56వ ఊర్సు ఉత్సవాలు 
  • ఉర్సు, మక్కా మహేశ్వర స్వామి కళ్యాణం ఒకేసారి నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత 
  • హాజరుకానున్న పలువురు ప్రముఖులు 

విశ్వంభర చింతపల్లి :- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో జాన్ పహాడ్ గా పేరుగాంచిన అజహరత్ అబ్బాస్ దర్గా ఉత్సవాలకు ముస్తాబవుతోంది.. చింతపల్లి మండలం పీకేమల్లేపల్లిలో కొలువైన ఈ దర్గా 56వ ఉర్సు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం, ఖమ్మం, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలిరానున్నారు. దర్గాను దర్శిస్తే శరీరంలోని రుగ్మతులు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఓ వైపు ఉర్సు మరో వైపు భక్త మహేశ్వరుడి కల్యాణం.. అజహరత్ అబ్బాస్ కింది భాగంలో ఉండగా గుట్ట పైభాగంలో మక్కా మహేశ్వరస్వామి ఆలయం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఓ వైపు మహేశ్వరస్వామి ఉత్సవాలు, మరో వైపు దర్గాలో ఉర్సు జరగడం ఇక్కడి ప్రత్యేకత. ఇకపోతే హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఈ దర్గా నిలిచిందని చెప్పవచ్చు. గుట్టపై శ్రీ వినాయక స్వామి, మహేశ్వరస్వామి, ఉమామహేశ్వర దేవి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు నవ విగ్రహాలనూ ప్రతిష్టించారు. ఈ ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించిన 75 అడుగుల ఎత్తు గల మక్క మదీన శివలింగం నమూనాల అలం కరణలు అమితంగా ఆకర్షిస్తాయి.

వెళ్లే మార్గం..

Read More యుద్ధ ప్రాతిపదికన SLBC పనులు: మంత్రి ఉత్తమ్  

చింతపల్లి మండలం మాల్, కుర్మేడు, కురంపల్లి, సాయిరెడ్డిగూడెం, మోదుగుల మల్లేపల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. ఉర్సు సందర్భంగా అన్ని రూట్లలో బస్సులను ఏర్పాటు చేశారు. 3 రోజులు అన్నదానం ఉంటుంది.

హాజరుకాన్ను మంత్రులు, ఐఏఎస్ అధికారులు..

అజహరత్ అబ్బాస్ దర్గా ఉత్సవాల్లో 60ఏళ్ల నుంచి ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఐఏఎస్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావడం ఆనవాయితీ. ఉత్సవాలకు శాసన మండలి చైర్మన్, గుత్తా సుఖేందర్ రెడ్డి,పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సినిమాటోగ్రఫీ, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు, పలువురు అధికారులు ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు.

Tags: