కవయిత్రి వెంకట లక్ష్మికి సన్మానం

కవయిత్రి వెంకట లక్ష్మికి సన్మానం

విశ్వంభర,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా పరిధిలాలు తండాకు చెందిన అంగన్వాడి టీచర్ కవయిత్రి తొట్ల వెంకటలక్ష్మిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. మహిళలపై తాను రచించి భావ,రాగ యుక్తంగా ఆలపించిన కవితకు సభికులు ప్రశంసించారు.అనంతరం అభ్యుదయ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంపెల్లి రామయ్య ఆధ్వర్యంలో ప్రముఖులు వెంకటలక్ష్మికి మెమెంటో అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా తనను గౌరవించి సన్మానించడం ఎంతో సంతృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. దీంతో సమాజం,మహిళల పట్ల కవితా రచనలపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.

Tags: