యువత గొంతునొక్కుతున్న బీజేపీ
- యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పొన్నం తరుణ్
విశ్వంభర, బోడుప్పల్ : నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా నిర్వహించిన షర్ట్‌లెస్ నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ అరెస్ట్‌ను నిరసిస్తూ ఢిల్లీలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్ద భారీ ఆందోళన జరిగింది. ఈ సంధర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కడి శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొన్నం తరుణ్ గౌడ్ ఢిల్లీకి చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కార్యాలయం ఎదుట చేరుకుని “రిలీజ్ ఉదయ్ భాను”, “డౌన్ డౌన్ డిక్టేటర్‌షిప్” అంటూ నినాదాలు చేశారు.ఈ మేరకు పొన్నం తరుణ్ గౌడ్ మాట్లాడుతూ, యువత గొంతు నొక్కడానికి చేసే ప్రయత్నాలను యూత్ కాంగ్రెస్ తిప్పికొడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన నిరసనను అణిచివేయడానికి అరెస్టులు చేయడం తగదన్నారు. అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును కాపాడాలని, వెంటనే ఉదయ్ భానును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



