రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వభర, పరిగి: పూడూరు మండల కేంద్రంలోని పీఎసీఎస్ కార్యాలయంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు సుమారు రూ.40 లక్షల విలువైన గోల్డ్ లోన్, ఎల్ టి లోన్ చెక్కులను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. రైతులకు యూరియా ఎరువుల బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు అందిస్తున్న రుణ సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని,వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు షకీల్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.