ప్రధాని మోదీకి బిజెపి శ్రేణుల పాలాభిషేకం

విశ్వంభర, నెల్లికుదురు: మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి మోదీ  ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం నిధులు  కేటాయించడంతో మండల కేంద్రం నెల్లికుదురులో బిజెపి రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మోడీ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు.మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్ రావు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా మూలకు పడేసిన విమానాశ్రయాన్ని అన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రధాని మోడీ నిధులు కేటాయించడం ప్రధానికి బిజెపికి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమకు నిదర్శనం అన్నారు. గత కాంగ్రెస్ తదితర ప్రభుత్వాలు విమానాశ్రయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. దేశమంతా కుటుంబంగా భావించే ప్రధాని మోదీకి రాష్ట్రాలు అభివృద్ధి చెంతేనే దేశం అభివృద్ధి చెందుతుందనే విశాల స్వభావం ఉంటుందన్నారు. ఇచ్చింది ప్రధాని అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రికి,కాంగ్రెస్ నేతలకు పాలాభిషేకం చేయడం విడ్డూరం అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్,వల్లబు వెంకటేశ్వర్లు,రామచందర్రావు,కళ్యాణ్ నాయక్,మదన్ లాల్,చందు రాజ్ కుమార్,పాపారావు,సురేష్ నాయక్,యాకిరెడ్డి, దుంపల సందీప్,చిలుపూరి వెంకన్న,ఇందు భారతి,ముస్తఫా,తోట రమేష్,జల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/prime-minister-modi-is-blessed-by-bjp-ranks/article-18709

Tags: