ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం: కాట్రగడ్డ ప్రసూన

విశ్వంభర, మెహదీపట్నం : ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైంది. బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం మెహదీపట్నం డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన 'తెలుగుదేశం ప్రజా పథం' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పాదయాత్ర నిర్వహించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, రహదారులు, డ్రైనేజీ, మహిళలకు పింఛన్లు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో నల్లెల్ల కిషోర్, జి.వి.జి. నాయుడు, పూసల వీరబాబు, పుప్పాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/struggle-is-katragadda-prasuna-until-public-issues-are-resolved/article-19848

Tags: