రామంతాపూర్‌లో ఉచిత రేబీస్ టీకా శిబిరం
విశ్వంభర, రామంతాపూర్ : రేబీస్ నిర్మూలనకు వీధి కుక్కలకు టీకాలు వేయడం అత్యంత ప్రభావవంతమైన మార్గం, ప్రజల సహకారంతో రేబీస్ రహిత హైదరాబాదే మా లక్ష్యమని సిటిజన్స్ ఫర్ యానిమల్స్ ప్రతినిధులు తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో హైదరాబాదు రామంతాపూర్‌లో ఉచిత యాంటీ రేబీస్ టీకా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 50కుపైగా పెంపుడు, వీధి కుక్కలు, పిల్లులకు రేబీస్ టీకాలు వేశారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు నగరంలో 3 వేల కుక్కలకు రేబీస్ టీకాలు వేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో పీపుల్ ఫర్ యానిమల్స్, హ్యూమేన్ వరల్డ్ ఫర్ యానిమల్స్, మధురోహా పెట్ కేర్, మిషన్ రేబీస్ ఇండియా, డబ్ల్యూవీఎస్ ఇండియా సంస్థల ప్రతినిధులు, పశువైద్య నిపుణులు, వాలంటీర్లు పాల్గొన్నారు