0 ఏళ్ల వయసులో ఇంటింటికీ  భగవద్గీత ప్రచారం 

విశ్వంభర, పరిగి మండల పరిధిలోని బాబాపూర్ గ్రామానికి చెందిన నీరడి అంజిలయ్య (80) వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా ఇంటింటికీ వెళ్లి శ్రీమద్భగవద్గీత సందేశాలను ప్రజలకు చేరవేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వ్యక్తి, ముఖ్యంగా విద్యార్థులు ఆధ్యాత్మిక విలువల వైపు మళ్లాలని కోరారు. ప్రతి ఇంటికి భగవద్గీత బోధనలను తీసుకెళ్లినప్పుడే సమాజంలో నైతిక విలువలు, మానవత్వం, సేవాభావం మరింత బలపడతాయని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు తగ్గుముఖం పట్టాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, వాటి పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. భగవద్గీత సోదరభావం, సేవాతత్వం, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని బోధిస్తుందని, అందువల్ల ఈ సందేశాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరవేయడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. బాబాపూర్, రూపపేట్ గ్రామాల్లో నిర్వహిస్తున్న వివిధ సత్సంగ కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొని భగవద్గీత విశిష్టతను ప్రజలకు వివరిస్తున్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/door-to-door-propagation-of-bhagavad-gita-at-the-age-of-0/article-19810

Tags: