రూ.12 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం
- అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నేత కొలను హనుమంత్ రెడ్డి
విశ్వంభర, డి. పోచంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డి. పోచంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలను హనుమంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి. శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాము గౌడ్, సంజీవరెడ్డి, ధర్మారెడ్డి, అక్బర్, హర్ష గౌడ్, సురేష్, వీరేశ్, శ్రీనివాస్, వెంకట్ తదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.