నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు ను అందించండి 

  • ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులను కోరిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే 

 విశ్వంభర, పెద్ద శంకరంపేట:  సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని నారాయణఖేడ్ నియోజకవర్గం రాష్ట్ర మంత్రులు తోడ్పాటు అందించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి కోరారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ రేట్ లో  సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కార్మిక శాఖ  మంత్రులు దామోదర్ రాజనర్సింహ వివేక్ వెంకటస్వామి సమక్షంలో జిల్లా ఉన్నతాధికారులతో జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో  సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అన్ని శాఖల అధికారులతో ముఖ్యంగా రైతులు వరి జొన్నల కేంద్రాల గురించి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ ,  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి  ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి  వివేక్ వెంకట్ స్వామి , గ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ శేట్కర్ ,మెదక్ ఎంపీ రఘునందన్ ఎమ్మెల్సీ,అంజి రెడ్డి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ,జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ * హాజరయ్యారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  మాట్లాడుతూ, నారాయణఖేడ్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వివిధ శాఖల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను అధికారులు ఆదేశించాలని కోరారు . నియోజకవర్గ పరిధిలోని రహదారుల మరమ్మతులు, అంతర్గత రోడ్ల నిర్మాణం  రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వేసవి, వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా చూడాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా స్థానిక ఆసుపత్రుల్లో సిబ్బందిని, మౌలిక వసతులను పెంచాలని  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన  మంత్రులకు మరియు జిల్లా అధికారులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో  ఎమ్మెల్యేలుసునీత లక్ష్మ రెడ్డి,చింత ప్రభాకర్,మాణిక్ రావు జిల్లా  ల,జిల్లా అదనపు కలెక్టర్లు,వివిధ శాఖల ఉన్నతాధికారులు  ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/provide-support-for-the-development-of-narayankhed-constituency/article-16420

Tags: