గోదావరి స్నానానికి వచ్చి వ్యక్తి మృతి
విశ్వంభర, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గోదావరిలో స్నానానికి వచ్చి వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన పంజాల రామన్న(75) కుటుంబ సభ్యులతో పలుమార్లు కాళేశ్వరం పుణ్య స్థానానికి వెళ్దామని చెప్పాడని అయితే తన ఆరోగ్యం బాగాలేనందున వారు నిరాకరించడంతో ఆ క్రమంలో 23 ఆదివారం ఉదయం ఇంట్లో వారికి చెప్పకుండా కాళేశ్వరం వచ్చాడు. గోదావరి నదిలో స్నానం చేయడానికి దిగిన అతను గోదావరిలో పడి చనిపోవడం జరిగింది. ఇది గమనించిన స్థానికులు
పోలీసులకు విషయం తెలిపారు. దాంతో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు తెలపగా కుటుంబ సభ్యులు కాళేశ్వరం వచ్చి గోదారి నదిలో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి తదుపరి చర్య నిమిత్తం ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



