కురుమూర్తి స్వామి సన్నిధిలో గోదాదేవి కళ్యాణం 

కురుమూర్తి స్వామి సన్నిధిలో గోదాదేవి కళ్యాణం 

విశ్వంభర, చిన్న చింతకుంట :-  మహబూబ్నగర్ జిల్లాలోని చిన్న తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి లో ఈరోజు గోదాదేవి కళ్యాణంఅంగ రంగ వైభంగ నిర్వహించారు. శ్రీ రంగనాథుడు శ్రీరంగంలో గోదాదేవిని తనలో ఐక్యం చేసుకున్న కళ్యాణంగా శతాబ్దాల నుండి సంక్రాంతి పండుగ భోగి రోజు వైష్ణవాలయాలు అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం జరుగుతున్న వేళ, భూదేవి మరో రూపంగా గోదాదేవి అవతారంలో అయోనిజగా విష్ణు చిత్తడిపులతో స్వామి  ని కొలిచే తులసి వనంలో దివ్యమైన తేజస్సుతో కనిపించి భక్తిశ్రద్ధలతో పెరిగి ప్రేమతో పూలమాలలతో శ్రీరంగనాధుని కొలిచి తన భర్త రంగనాథుడే అని నమ్మి న భక్తురాలి భక్తికి పరవశమై తనలో ఐక్యం చేసుకున్నట్టు భక్తుల శ్రీరంగనాధుని కొలిచేందుకు 30 పాశురాలలో తిరుప్పావై గ్రంథం రచించి ధనుర్మాసంలో ఆలయాల్లో అర్చకులు ప్రతిరోజు పట్టిస్తూ ధనుర్మాస పూజలు చేస్తారని తెలిపారు. గోదాదేవి కళ్యాణం తిరుప్పావై విన్న గోవిందుడు ఎల్లవేళలా తమ వెంటే ఉంటాడని భక్తులు నమ్మకం. నేడు కురుమూర్తి స్వామి వెంకటేశ్వరుని ఆలయంలో అంగరంగ వైభవంగా పూల పందిరిలో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇంటి దేవుడిగా కొలుచుకుని చిన్నచింతకుంట మండలం అమ్మపురం గ్రామ కురుమూర్తి గట్టు పై వెలసిన శ్రీ కురుమూర్తి శ్రీనివాసుడి సన్నిధిలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నామని ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

 

Read More జనవరి 18న  సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం 

Tags: