మోడల్ స్కూల్ లో బేటీ బచావో – బేటీ పడావో

మోడల్ స్కూల్ లో బేటీ బచావో – బేటీ పడావో

 విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రములోని మోడల్ పాఠశాలలో బుధవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళా–శిశు–వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో డిచిపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని దర్పల్లి మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్, ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోతి హాజరై  సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్షతపై మాట్లాడారు. బాలురు–బాలికల మధ్య సమానత్వం అవసరాన్ని వివరించారు.  బేటి బచావో – బేటి పడావో కార్యక్రమ లక్ష్యాలను వివరించి, లింగ వివక్షత నిర్మూలనలో యువత భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు సరిత  బుజ్జి , పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్  ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది సౌమ్య, పుష్ప, కవిత పాల్గొన్నారు.

Tags: