కామన్ డైట్ మెనూ పాటించాలి

కామన్ డైట్ మెనూ పాటించాలి

  • జిల్లా కలెక్టర్ కె. హైమావతి 

విశ్వంభర, సిద్దిపేట: దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి బుధవారం పరిశీలించారు. రోజు కామన్ డైట్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు రుచికరంగా వండాలని పంట సిబ్బందిని ఆదేశించారు. వంట ప్రక్రియను రోజు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు తినేంతవరకు మానిటర్ చేయాలని ఆదేశించారు. రాయపోల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఆస్పత్రి సమయ వేళలు పాటిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని  పరిశీలించారు. ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత మెరుగుపరచాలని, రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులు హాజరు ప్రకారం సరుకులు అందించాలని ఎప్పటికప్పుడు రిజిస్టర్లో తప్పనిసరిగా రాయాలని విద్యార్థులకు భోజనం, వసతి విషయంలో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

Tags: