జనవరి 18న సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం
On
విశ్వంభర, హైదరాబాద్ :- ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన పద్మశాలి సర్పంచ్ ,ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లకు జనవరి 18 న ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీనగర్ లోని స్వకులశాలి భవన్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గెలిచిన అభ్యర్థులకు ఐక్య వేదిక ద్వారా సత్కారంతో పాటు , జ్ఞాపికను అందజేయడం జరుగుతుందని అన్నారు. కావున ఈ కార్యక్రమానికి మీ ప్రాంతాలలో గెలిచినా పద్మశాలి అభ్యర్థులకు సమాచారం చేరవేయవల్సిందిగా ఐక్య వేదిక కమిటీకి తెలిపారు. అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి పద్మశాలి ప్రముఖులు, ఎంఎల్ఏ లు, ఎంపీ లను ఆహ్వానించడం జరిగిందని అన్నారు. త్వరలోనే ఆహ్వాన పత్రిక ను కూడా విడుదల చేస్తామని తెలియజేశారు. పూర్తి వివరాలకు చరవాణి 9866477255 కి సంప్రదించగలరని కోరారు.



