రోటరీ క్లబ్ అధ్యక్షుడు దూదికట్ల సత్యంకు ఆత్మీయ సత్కారం
విశ్వంభర, కురవి: మహబూబాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా కురవి గ్రామానికి చెందిన దూదికట్ల సత్యం ఎన్నికైన సందర్భంగా ఆయనను స్వగ్రామంలో ఘనంగా సత్కరించారు. కురవిలోని ఆయన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, సామాజిక నాయకులు పాల్గొని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ కురవి మండల నాయకుడు, మాజీ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు నూతక్కి నరసింహారావు, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్, నమస్తే తెలంగాణ కురవి మండల ప్రతినిధి సంగెం నాగరాజు, సత్యం తండ్రి, సీపీఐ పార్టీ కురవి మండల సీనియర్ నాయకుడు దూదికట్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మధ్యతరగతి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం సంపాదించిన సత్యం మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా సమాజ సేవకు ప్రాధాన్యం ఇస్తూ, అవసరమైన వారికి అండగా నిలిచి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. సత్కారానికి స్పందించిన దూదికట్ల సత్యం తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవే తన ప్రధాన లక్ష్యమని, రోటరీ క్లబ్ ద్వారా విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.