డాక్టర్ శిరీషకు వైద్యరత్న అవార్డు

డాక్టర్ శిరీషకు వైద్యరత్న అవార్డు

విశ్వంభర, సిద్దిపేట:  జిల్లా కేంద్రంలోని మేఘన హాస్పిటల్ వైద్యురాలు డా.శిరీషకు ప్రతిష్టాత్మక 'వైద్యరత్న' అవార్డు వరించింది. హైదరాబాద్‌లో మదర్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ఆమెకు ఆదివారం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 25మంది వైద్యులను వైద్యరత్న అవార్డుతో సత్కరించగా, వారిలో సిద్దిపేటకు చెందిన డాక్టర్ శిరీష ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. కుటుంబసభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, సిద్దిపేట ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందని, బాధ్యత కూడా పెరిగిందని తెలిపారు. పేదలు, సామాన్య ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/vaidya-ratna-award-to-dr-sirisha/article-19895

Tags: