బీసీ కులగణన చేపట్టాలి: బహుజన ముక్తి పార్టీ

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తాను బీసీ వర్గానికి చెందినవాడినని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ, బీసీ కులగణన చేపట్టకపోవడం ఆ వర్గాల ఆకాంక్షలను విస్మరించినట్లే, కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా బీసీ కులగణన నిర్వహించాలి అని బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు దాస్ రాం నాయక్ అన్నారు. బీసీ కులగణన పోరాట దినం సందర్భంగా ఆదివారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రాజకీయ, సామాజిక న్యాయం జరగాలంటే కులగణన అత్యవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అంసోల్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లకే పరిమితం చేస్తున్నాయని విమర్శించారు. బీసీల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలని, ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ముక్తి మహమ్మద్ ఫహీముద్దీన్, ప్రొఫెసర్ వి. ధరయ్య, దాసరి అజయ్ కుమార్ యాదవ్, జనార్ధన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bahujana-mukti-party-should-take-up-bc-caste-census/article-19874

Tags: