కల్తీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో, రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.రవి, రామన్నపేట ఎస్సై జి.సతీష్, పోలీసు సిబ్బంది రామన్నపేట మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా, అందులో ఎటువంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో అల్లం పేస్ట్ డబ్బాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్‌ను విచారించగా, ఈ అల్లం పేస్ట్ కీసర ప్రాంతంలోని ఒక తయారీ యూనిట్‌లో తయారు చేసినట్లు తెలిపాడు. దీనిపై వెంటనే పోలీసులు కీసరలోని సంబంధిత తయారీ కేంద్రానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో, కల్తీ అల్లం పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం సంబంధిత ప్రాంగణంలో సోదాలు నిర్వహించి, కల్తీ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు, యంత్రాలు, తయారైన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణాపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని హెచ్చరించారు. ఈ చర్యను స్థానిక ప్రజలు అభినందిస్తూ, జిల్లా పోలీసు యంత్రాంగం మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రశంసించారు.