విశ్వంభర వార్తకు స్పందించిన అధికారులు.. తొలగించిన ప్రమాదకర విద్యుత్ స్తంభం

విశ్వంభర, బర్కత్‌పుర్: బర్కత్‌పుర్ ప్రాంతంలో ప్రజలకు ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభంపై "ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం" శీర్షికతో విశ్వంభరలో మంగళవారం ప్రచురితమైన చిత్రకథనానికి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి సమస్యను పరిష్కరించారు. సదరు విద్యుత్ స్తంభం దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో స్థానికులు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విశ్వంభర కథనం ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి అవసరమైన చర్యలు చేపట్టారు. సమస్యను తక్షణమే పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న విశ్వంభర కథనానికి అధికారులు సత్వర స్పందన ఇవ్వడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఇలాంటి ప్రజా సమస్యలపై సంబంధిత శాఖలు ఇదే తరహాలో స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-dangerous-power-pole-removed-by-officials-who-responded-to/article-18683

Tags: