ఫీజు బకాయిలు విడుదల చేయాలని రామన్నపేటలో మహాధర్నా

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, జీవో నెం.9ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో మహాధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి, మెస్ ఛార్జీలు పెంచాలని, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను అర్హులందరికీ అందించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి, విద్యా రంగానికి తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్‌తో పాటు పలువురు ప్రజా, రాజకీయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mahadharna-in-ramannapet-to-release-fee-arrears/article-18693

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్