ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

  • సర్పంచ్ దేవేందర్ నాయక్ 

  విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం  గంగారం గ్రామపంచాయతీ లో నిరుపేదలైన వారిని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో  గంగారం గ్రామానికి చెందిన సలేకుల అనిత కు  గ్రామ సర్పంచి దేవేందర్ నాయక్ సహకారంతో  ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవ్వడంతో  ఇందిరమ్మ ఇల్లు  నిర్మించుకున్న శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇల్లు   గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ నాయక్  మాట్లాడుతూ, ప్రతి పేదవారికి ఇందిరమ్మ  ఇల్లు ఉండాలని గ్రామంలోని ఇంకా పేదవారు ఎవరైనా ఉంటే గుర్తించి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేఎల్ఆర్ సహకారంతో, సీఎం దృష్టికి తీసుకువెళ్లి  ఇందిరమ్మ ఇండ్లు, వీధిలైట్లో సిసి రోడ్లు  పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయిస్తానని  గంగారం గ్రామపంచాయతీ ని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ మహేందర్, వార్డ్ మెంబర్స్ ఎం మోహన్, ఎం రవి,ఎం ధర్మ, ఎం దేవా, కే రాజు, గ్రామ సెక్రెటరీ నవీన్ యాదవ్, భాగ్యమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

🕒 08 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/indirammas-house-for-every-poor-family/article-15072

Tags: