ఏరియా ఆస్పత్రిలో పేషెంట్ లకు గద్దె విజయ్ నేత పండ్లు పంపిణి.
ఘనంగా 44వ తెలుగుదేశం ఆవిర్భావం దినోత్సవం వేడుకలు
విశ్వంభర, హైదరాబాద్ :- తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ లకు ప్రముఖ సామాజికవేత్త ,టిడిపి బీసీ సెల్ మెంబెర్, తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి అడహక్ కమిటీ మెంబర్, బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత పండ్లు , బిస్కెట్ పాకెట్స్ ను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి బహుజన వర్గాల పక్షాన నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ అని , అలాగే ఎంతోమంది దళిత, బహుజన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టి ఉన్నతపదవులును అందించిన ఘనత టీడీపీ పార్టీది అని వారు కొనియాడారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ గత 44 సంవత్సరాలుగా ఎక్కడ కూడ తగ్గకుండా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన , ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసమే నిరంతరం తపించిన పార్టీ తెలుగుదేశం అని ఎన్టీఆర్ తరవాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆనాటి నుండి నేటి వరకు పార్టీ ని భుజ స్కందాలపై వేసుకొని టీడీపీ పార్టీ కి , కార్యకర్తలకు అండగా ఉంటూ నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పోరాడుతున్న , శ్రమిస్తున్న చంద్రబాబు నాయకత్వం నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో కూడా టీడీపీ పార్టీ క్రీయాశీలక పాత్ర వహిస్తుందని వారు అన్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావ సందర్బంగా ఏరియా ఆసుపత్రిలో 100 మంది పేషెంట్ లకు పండ్లు , బిస్కట్ పాకెట్స్ ను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్ రావు , భాగ్యలక్ష్మి , ఆంజనేయులు, వినయ్, గిరి, పుల్లారెడ్డి, నరేష్ , క్రాంతి, అశోక్, చోటు , ఉపేందర్ వర్మ , భాస్కర్ , వెంకట్ తదితరులు పాల్గొన్నారు.



