అధికారుల నిర్లక్ష్యంతో భగీరథ నీరు వృధా - కలుషితంగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు ..!

అధికారుల నిర్లక్ష్యంతో భగీరథ నీరు వృధా - కలుషితంగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు ..!

  • నాగర్ గూడలో భగీరథ పైపు లీక్.
  • పట్టించుకోని అధికారులు.
  • నిలిచిన నీరు వ్యర్ధాలుగా మారి అదే నీరు ఇంటింటికి సరఫరా
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం  
 

విశ్వంభర, షాబాద్ మండలం, నాగర్ గూడ: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం నాగర్ గూడ గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్  పగిలి నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం స్థానికుల్లో ఆగ్రహానికి దారితీస్తోంది. గ్రామ రహదారి పక్కన పగిలిన పైపు ద్వారా తాగునీరు రోజూ వృథాగా పారుతుండగా, అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అలాగే పగిలిని పైప్ లైన్ ను మరమ్మత్తులు చేయించకుండా లీక్ అయినా వాటర్ మురికి నీరుగా నిల్వగా మారి అదే నీరు పైప్ లైన్ పగిలిన చోటు నుండి మంచి నీటిలో కలవడం స్థానికంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. కలుషితమైన నీరు త్రాగడం వల్ల విషపు రోగాలబారిన పడుతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభమై గ్రామాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో, ఈ విధంగా నీరు వృథా కావడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు భగీరథ నీరు రోడ్డుపైనే పారడం  అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయంపై నాగర్ గూడ మాజీ సర్పంచ్ ఈదుల కృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే పైపు లీకేజీని మరమ్మతు చేసి తాగునీటి వృథాను ఆపాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
 

Tags: